ఈ సీజన్ లో కచ్చితంగా 300 పరుగుల రికార్డును బద్ధలు కొట్టేస్తారనే హైప్ లో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్...మ్యాచ్ లే గెలవటం లేదయ్యో తుస్సు అన్నట్లుగా తయారయ్యారు. మొదటి మ్యాచ్ లో 286 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు పెట్టిన సన్ రైజర్స్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి మొన్న పంజాబ్ మీద 245 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసి గెలిచింది. కానీ నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో మళ్లీ ఓడిపోయిన సన్ రైజర్స్ పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున తొమ్మిదో స్థానంలో ఉంది. చెన్నైది కూడా సేమ్ కథ. సన్ రైజర్స్ లానే మొదటి మ్యాచ్ ముంబై మీద గెలిచిన చెన్నై తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. మొన్న LSG మీద మ్యాచ్ లో గెలిచి మళ్లీ రేసులోకి వచ్చిన చెన్నై ఆదివారం ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ ఆడిన ఆట చూస్తుంటే..రెండూ సరిగ్గా 7 మ్యాచ్ లే ఆడాయి. రెండు టీమ్స్ ఐదు ఓడిపోయాయి రెండు మ్యాచులు మాత్రమే గెలిచాయి. పాయింట్స్ సమానంగా 4. పైగా నెట్ రన్ రేట్ చాలా దగ్గరగా ఉంది. సన్ రైజర్స్ ది -1.217 ఉంటే చెన్నైది -1.276 ఉంది. ఇలా లీగ్ మొత్తం ఒకే లా ఒకేలా ఓడుతూ..ఏదో అప్పుడప్పుడూ గెలుస్తూ సన్ రైజర్స్, చెన్నై సేమ్ టూ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. సన్ రైజర్స్ తో చెన్నైతో నే ఉంటూ తన ప్రేమను చాటుకుంది. ఇప్పుడు మిగిలిన సగం ఐపీఎల్ సీజన్ చాలా క్రూషియల్ కాబట్టి తమకు మిగిలి ఉన్న అవకాశాలన్నీ సన్ రైజర్స్ సముర్థంగా వాడుకుంటూ...ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లు అంతా కాటేరమ్మ కొడుకుల్లా చెలరేగితేనే పాయింట్స్ టేబుల్ లో చెన్నైని వదిలేసి హైదరాబాద్ ముందుకు వెళ్లగలుగుతుంది. లేదంటే కాటేరమ్మకు అసలు కొడుకులు లేరని అనుకోవాలి ఈసారి.